Archive for డిసెంబర్, 2010

సంకెళ్ళు

Posted on డిసెంబర్ 11, 2010. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , |

కొన్ని సార్లు మనము చేస్తున్న పనులవలన లాభం చేకూరకపోవచ్చు. అప్పుడు మనకు మరెన్నో మార్గాలు కనిపించవచ్చు. ఆ మార్గాలు గుండా పయణిస్తే మనకు లాభం చేకూరవచ్చని మనలో ఏదో భాగం చెప్తున్నా మనము ఆ మార్గమును ఎంచుకోము. మనలో ఒక అఛేతనా వాణి మనలను ఆ మార్గములో సాగమని చెప్తూనే వుంటుంది. మనకు మొరపెట్టుకుంటుంది. మనతో వాదులాడుతుంది. గింజుకుంటుంది. కాని మనము ఆ మార్గమును ఎంచుకోము.

ఆ మార్గమును మనము ఎంచుకోకపోవడానికి పలు కారణాలు వుండవచ్చు :

బద్ధకము
మార్పు యొక్క భమము
అంతిమ ఫలితము మీద సందేహము
ముందుకు సాగకుండా మనలను కట్టిపడవేసే ఏదో భారము

ఈ కారణాలు మన ఎదుగుదలకు సంకెళ్ళు. క్రొత్త విధాలను అవలంభించడం, క్రొత్త పద్ధతులను పాటించడం, ముఖ్యంగా మన పనితీరులో అవసరమైన మార్పును తీసుకురావడం మనకు లాభదాయకము అని మనకు అగుపించినప్పుడు వాటిని మనము స్వాగతించాలి. మారడం వలన శిరచ్చేధన చేయబడుతుంది అని అనిపిస్తే ఆ పని చేయవద్దు. అలా కానిపక్షాన ఆ మార్పును ఎందుకు స్వీకరించరాదు?

మన పనులకు ఫలితములు అందని   … మనము మారకుండా చింతించడం మూర్ఖత్వం, అవివేకం. మన లోపాన్ని ఇతరుల మీదకు నెట్టడం, పరిస్థితులను సాకుగా చెప్పి తప్పించుకోవడం అమానుషం.

మన సంకెళ్ళను మనమే తొలగించుకోవాలి. మనకు శారీరకంగా, సామాజికంగా విధించబడిన సంకెళ్ళను ఇతరులు తొలగించగలుగుతారేమో గాని, మానసికంగా మనకు మనమే విధించికున్న సంకెళ్ళను తొలిగించడం ఇతరులకు సాధ్యం కాదు. ‘ నాది ఏమి చేయలేని పరిస్థితి ‘, ‘ నేను బంధీను ‘ అనే భావనలతో గనక మనము బ్రతికెతే ఎవ్వరూ మనలను కాపాడలేరు. చివరకు ఆ దేవుడు కూడా ఏమి చేయలేడు. మన జీవితం మన చేతులలోనే… మన చేతలలోనే ….

Read Full Post | Make a Comment ( 1 so far )

Liked it here?
Why not try sites on the blogroll...