Archive for డిసెంబర్, 2014

స్కూబా డైవింగ్

Posted on డిసెంబర్ 14, 2014. Filed under: ప్రాయాణాలు, వ్యక్తిగతం | ట్యాగులు:, , , , , , |

శ్వాస తప్ప వేరొక శబ్దం వినపడకుండా వుండగా, వివిధ రంగుల చేపలు కనువిందు చేయగా, సముద్ర గర్భంలోని మట్టి మరియు పొదలను తాకుటూ నెమ్మదిగా కదులుతుండగా, నా చుట్టూ వున్న ప్రపంచం నిలకడగా వున్నట్టు, జీవితం ఎంతో అద్భుతంగా అగుపిస్తున్న ఆ క్షణాలు ఎంతో రమణీయం. ఆ క్షణాలలో నాలో నిశబ్దం ఆవరించింది. అది జీవితాంతం మరవలేని జ్ణాపకం.

స్కూబా డైవ్

స్కూబా డైవ్

మనిషి పక్షిలాగా గాల్లో ఎగరాలన్న కోరికతో విమానం కనుగొంతే, చేపలా ఈదాలన్న కోరికతో స్కూబా డైవింగ్ కనుగొన్నాడని అనిపిస్తుంది. సముద్రంలోని ప్రకృతిని ఆశ్వాదించాలన్న నా కోరిక స్కూబా డైవింగ్ ద్వారా నెరవేరింది. అందులోనూ మాల్టా యొక్క మైమరిపించే మధ్యదరా సముద్ర నీటిలో స్కూబా డైవింగ్ చేయడం, మిక్కిలి ఆనందాన్ని కలిగించింది.

స్కూబా డైవింగ్ ప్రక్రియ అంత సులభమేమి కాదు. పైగా ఇది బలహీన శరీరులకు, అజాగ్రత్త మరియు చంచల మానస్కులకు మంచిది కాదు. వీరికి ఈ ప్రక్రియ, జీవితంలో కొత్త అనుభూతి ఇవ్వకపోగా, వారి నుండి వారి జీవితాన్నే తీసేసుకుంటుంది. స్కూబా డైవింగ్ చేయడానికి, సావధానత మరియు క్రమశిక్షణ వంటి గుణములతో పాటు, కొన్ని పరికరాలు అవసరం. ఆ పరికరాలను మన శరీరానికి తగిలించుకోవడం మరియు వాటి వాడక పద్దతులు సరిగ్గా నేర్చుకోవడం, అతి ముఖ్యం.

డైవింగ్ చేస్తున్నప్పుడు, ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బంది కలిగించినా, తరువాత అది ఇట్టే అలవాటు అయ్యింది. స్కూబా డైవింగ్ పరికరాలు, నీటి లోపల పనిచేయడం కొరకు తయారు చేయబడింది; నీటి ఉపరితలంలో లేక నేల మీద కొరకు కాదు; అది అర్థం చేసుకోవడానికి కాసింత సమయం పట్టింది. మొదటి సారి స్కూబా డైవింగ్ చేసినప్పుడు పడ్డ అవస్థ, రెండవ సారి గుర్తుకు కూడా రాలేదు. రెండవ సారి, నన్ను నేను కాపాడుకోవడానికి ప్రయత్నించడం ఆపి, నా పరిసరాలను ఆస్వాదించడం మొదలుపెట్టాను. అది కూడా, ఇవన్నీ నాకు తెలియకుండా జరిగిపోయింది.

స్కూబా డైవింగ్, నా సాహస క్రీడల చిట్టలో మొదటిది. కొన్ని సార్లు మాత్రం చేసి ఆపేసేటటువంటిడి కాదు ఇది; అవకాశం దొరికినంత కాలం, చేయదగ్గ ప్రక్రియగా నాకు ఇది మారింది.

Read Full Post | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...