Uncategorized

నమ్మ(నా) బెంగళూరు

Posted on జూన్ 11, 2013. Filed under: Uncategorized | ట్యాగులు:, , , , , |

నమ్మ బెంగళూరు అంటే మన బెంగళూరు. పది రోజుల్లో ఈ వూరికి .. క్షమించాలి .. ఈ నగరానికి ఎంతగానో అలవాటు పడ్డాను. ఇచ్చటి చల్లటి వాతావరణమా.. లేక ఉద్యానవనాలా.. లేక బవంతులా.. పలు సంస్కృతుల వ్యక్తులు కలిసి మెలిసి వుండడమా.. కారణమేదని సరిగ్గా చెప్పలేకున్నా. ఏదైతేనేమీ.. నమ్మ బెంగళూరిని .. నా బెంగళూరుగా చేసేసుకున్నాను. రోడ్లమీద రద్దీ కొందరికి చిరాకు తెప్పిస్తుండవచ్చు. అధిక ధరలు కొందరిని బెంబేలు పెట్టిస్తుండవచ్చు. తరిగిపోతున్న పచ్చదనము అందరిని విచారణలోకి తోస్తుండవచ్చు.. కానీ, ఇవేవీ బెంగళూరు పై నాకు క్రొత్తగా చిగురించిన ప్రేమను చంపలేవు..

బెంగళూరు వచ్చాక, బిజినెస్ మేన్ లో మహేశ్ బాబు లాగా.. ఈ వూరు నాది.. ఇక్కడ నా జెండా పాతేస్తాను.. ఈ వూరిని వు* పోయిస్తానని.. చెప్పాలని ప్రయత్నించాను. కానీ నా గదిలో మిత్రులు ఉత్తరాది వారు అయివుండడం చేత, నాకు నిరాసే మిగిలింది.. 

ఈ నగరం పలువీరికి బ్రతుకు తెరువు ప్రసాదించడమే కాక, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఈ స్థల మార్పిడి నాకు కూడా కలిసిరావలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

స్వర్గం – నరకం

Posted on అక్టోబర్ 2, 2012. Filed under: Uncategorized | ట్యాగులు:, , , , , , |

తొండంలో గ్రుచ్చుకున్న ముల్లు, ఎంతటి బలిష్ఠమైన ఏనుగునైనా గజ గజలాడించగలదు. మనసుకు తగిలే ముల్లులు కూడా, మనిషిని తికమక పెడుతుంది.  అందరూ ఏదో ఒక దశలో ఇటువంటి అనుభూతిని చవి చూసి  వుంటారు. జీవితం పూల బాట కాదుగా, పూలతో కూడిన ముల్లులు కూడా వుంటాయి.

‘ఆ నలుగురు’ చిత్రంలో ‘దుఃఖంలో వుండడం అంటే నరకం, సుఖాన్ని ఆస్వాదించడం అంటే స్వర్గం’ అని ఒక పాత్ర చాలా చక్కగా చెప్పాడు. మనిషికున్న సహజ సిద్ధ స్వభావం చేత దుఃఖాన్ని అధిగమించి బయట రావడం కష్టతరమే. దుఃఖంలో మునిగి వుండడం కన్నా, ఆ స్థితిలో మనము వున్నాము అని గుర్తించి, ఆ స్థితి నుంచి బయట రావాలని నిశ్చయించుకొని చేసే ప్రయత్నాలు ఇంకా కష్టతరమే కావచ్చు, కానీ కష్టించి బయటకు వస్తేనే మనిషి సుఖాన్ని పొందగలడు.

బాధ, నిరుత్సాహము, ఆవేదన.. ఇవ్వన్ని దుఃఖానికి దారి తీస్తుంది. బాధలను దిగమింగి, నిరుత్సాహాన్ని పారద్రోలి, ఆవేదనలను లెక్కచేయకుంటేనే సుఖాన్ని అనుభవించగలము. కోరికలు నెరవేరక పోతే, వాటిని నెరవేర్చుకోవడాయనికి తగిన ప్రయత్నాలు చేయకుంటే, దుఃఖమే మిగులుతుంది. కానీ మనము చేస్తున్నఆ ప్రయత్నాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగితే, కోరిక నెరవేరాక మాత్రమే కాకుండా, ఆ కోరికల కొరకు మనను చేసిన ప్రయత్నాలు కూడా సుఃఖాన్ని కలగజేస్తుంది.

టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

అవమాన కారణాలు

Posted on సెప్టెంబర్ 27, 2011. Filed under: Uncategorized | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , |

ఈనాడు పత్రికలో ఈ వ్యాసాన్ని చదివాను. నా మనసుకు హతుకున్న ఈ వ్యాసాన్ని ఇక్కడ మీతో  పంచుకుంటున్నాను.

లోకంలో పుట్టిన మానవులందరికి తమ జీవితంలో నిత్యం ఎదురయ్యేవి మానావమానాలు. మానం అంటే గౌరవం. అవమానం అంటే తిరస్కారం. ఈ రెండింటికీ ప్రత్యేక కారణాలు వుంటాయి. అవమాన కారణాల గురించి తప్పక తెలుసుకోవలసిందే.

పెద్దలు అవమానం విషయంలో ఎన్నో కారణాలు విడమరచి చెప్పారు. వాటిని ఒకసారి గుర్తుచేసుకుంటే మనిషి అవమానానికి లోనుకాకుండా జాగురూకత పడవచ్చు. అతి పరిచయం, అనాహూత ప్రవేశం, సంతతగమనం, అపృష్టక ధనం వాటిలో కొన్ని.

అతి పరిచయం అంటే ఎక్కువగా పరిచయాన్ని కలిగి ఉండటం. ఇది అవమాన కారణం ఎలా అయిందంటే- మలయ పర్వతంపైన నివసించే గిరిజనులు ప్రతినిత్యం వేల కొలది చందనవృక్షాలను చూస్తూ ఉంటారు. వాటితో వారికి అమితంగా పరిచయం ఉన్నకారణంగా వారికి ఆ చందన వృక్షం చులకనగా కనబడుతుంది. ఆ కారణంగా వారు ప్రతి నిత్యం విలువైన చందనపు కట్టలను సైతం పొయ్యి మండించడానికి ఇంధనంగా వాడుకుంటారు.  చందనపు చెక్క ఒక చిన్న ముక్క దొరికినా చాలు భాగ్యమే అనుకొంటూ అరగదీసి, గంధాన్నిదేవతార్చనలో ఉపయోగిస్తారు ఆస్తికులు. అంతటి ఉన్నత ప్రయోజనానికి వాడవలసిన చందనాన్ని దుర్వినియోగం చేయడానికి కారణం ‘అతి పరిచయం’ మాత్రమే.

పిలవని పేరంటాలకు వెళ్లకూడదనేది ఒక నీతి. ఇలా పిలవకుండానే వెళ్లి అవమానాల పాలైనవాళ్లు చరిత్రలో ఇతిహాసాల్లో పురాణాల్లో ఎందరో ఉన్నారు. సాక్షాత్తు పరమశివుని భార్య సతీదేవి ఇందుకు చక్కని ఉదాహరణ. పరమశివుని మామ, సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి లోకోత్తరమైన యాగాన్ని చేయడానికి నిర్ణయించుకుంటాడు. సకల దేవతనలూ ఆహ్వానించి, తన అల్లుడూ త్రిభువనారాధుడూ అయిన పరమశివుణ్నీ తన కూతురైన సతీదేవినీ పిలవడు. అయినా సంగతి తెలుసుకొని పుట్టింటి మీద ఉన్న మమకారంతో సతీదేవి యాగానికి వెళ్లివద్దమని భర్తను కోరుతుంది. పరమశివుడు ససేమిరా అంటాడు. పిలవకుండా వెళ్లడం మంచిది కాదని భార్యకు హితం చెబుతాడు.అయినా సతీదేవి తాను వెళ్తానని భర్తతో చెప్పి, తండ్రి చేసే యాగస్థలికి చేరుకొంటుంది. అక్కడ ఆమెను చూసినవాళ్లు పలకరించరు. ఆత్మీయులు ఆదరించరు. పైగా తన తండ్రి కూడా పరమశివుడిపై లేనిపోని నిందలు వేసి, తూలనాడతదు. ఇలా అవమానాలను అబుభవించి, నిదలను చెవులారా విని సహించలేక, తనువు చాలించాలనుకొని యోగాగ్నిని కల్పించుకొని, అందులోకి దూకి ప్రాణాలు విడుస్తుంది. పిలవని చోటికి వెళ్తే ఎవరికైనా అవమానాలు తప్పవనడానికి ఈ సంఘటన ఉదాహరణగా మిగిలింది.

మాటిమాటికీ ఎవరై దగ్గరకూ వెళ్లకూడదనేది మరొక నియమం. కొత్త అల్లుడికి అత్తవారింటిలో సకల మర్యాదలూ జరుగుతాయి. కాలు కదపకుండానే నోటిముందుకు విందు భోజనాలు వచ్చి పడతాయి. ఈ మర్యాదలన్నీ కొంతకాలానికే పరిమితం, అత్తవారింటిలో తేరగా అన్నీ దొరుకుతున్నయి గదా అని అల్లుడు మాటిమాటికి అత్తవారింటికి వెళ్తే ఏమవుతుంది? ఏదో ఒకరోజు తిరస్కారం అనే పురస్కారం సంప్రాప్తిసుంది. కనుక ఎవరైనా ఔచిత్యం లేకుండా మాటిమాటికీ వెళ్లకూడదు.

‘అడగరానిది ఎవరికీ ఏదీ చెప్పరాదు ‘ అనేది వేదసూక్తి. కొంతమందికి ఎలాంటి పనీ పాటా ఉండదు. ఎప్పుడూ ఇతరుల చేష్టలను గమనిస్తూ తప్పులు వెదుకుటూ ఉచితంగా సలహాలు దానం చేస్తుంటారు. ఇలాంటివాళ్లకు అవమానం తప్పదని ‘పంచతంత్రం’ లోని ఒక పక్షి కథ చెబుతుంది. ఆ కథలో కొన్ని కోతులు అడవిలో చలి బాధకు తట్టుకోలేక పుడకల్నీ ఏరుకొని తెచ్చి, ఒక చోట కుప్పగా పోసి, మంటను రగిలిద్దామనుకుంటాయి. వటికి నిప్పు దొరకలేదు. ఇంతలో నిప్పులా మొరుస్తూ ఎగురుతున్న మిణుగురు పురుగుల్ని చూసి, వాటిలో నిప్పు ఉన్నదనుకొని, ఆ పురుగుల్ని పట్టి తెచ్చి, పుల్లలపై వేస్తాయి. ఎంతకూ మంటరాకున్నా, ఆ పనిని పదేపదే చేయడం గమనించిన ఓ పక్షి- నిప్పు అలా పుట్టదనీ, అలా చేయడం వ్యర్థ ప్రయాస అనీ నచ్చజెబుతంది. అప్పటికే చలిబాధకు కోపంతో ఉన్న కోతులు ఆ పక్షి మెడను గట్టిగా పట్టుకొని, నేలకు బాది, చంపేస్తాయి. అపృష్టకథనం వల్ల అనర్థాన్ని కొని తెచ్చుకోవడమంటే ఇదే.

గౌరవం లేకపోయినా నష్టం లేదు కానీ, అవమానం మాత్రం కలగకూడదనీ, అది మచవంటిదని గ్రహిస్తే జీవితంలో సంతృప్తి మిగులుతుంది.

మూలం : ఈనాడు పత్రిక – అంతర్యామి 

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

దిగజారిన ప్రవర్తన

Posted on డిసెంబర్ 16, 2009. Filed under: తెలుగు, Uncategorized | ట్యాగులు:, , , , , , , , , , , , , , |

కాంగ్రెస్ హై కమాండ్ రాత్రికి రాత్రి తెలంగాణ అంశమై ఒక తీర్మానం చేయడం కొందరికి ఆగ్రహం తెప్పించింది. ఆ నిర్ణయాన్ని చిదంబరం వెలువరించారు. ఇక్కడ తప్పొప్పులు గూర్చి నేను చర్చించ దలచలేదు. కాని, నిరసనలను తెలిపాల్సిన విధమే బాగో లేదు. కొందరు తమిళులు తెలంగాణపై మాట్లాడారని, పొట్టి శ్రీ రాములు వారి నెల్లూరు జిల్లాలో కొందరు ఉద్యమకారులు, చెన్నై నగరానికి దాహార్తి తీర్చే తెలుగు గంగ నీటిని ఆపివేసారు. చెన్నై నగర వాసులు వీరికి ఏమి అపకారం తలపెట్టారని, వీళ్లు ఈ పని చేయాలి? మేము మాత్రం ఏమైనా తక్కువ తిన్నామా అనే భావంతో వారు ఈ రోజు ఆంధ్ర నుంచి వచ్చే వహనాలను త్రిప్పి పంపివేస్తున్నారు.

మన ఆర్.టీ.సీ బస్సులను తగలబెడితే ఏమి వస్తుండండి?! మనము నవ నాగరిక సమాజంలో వున్నామన్నది మరుస్తున్నామెందుకు? రేపు బస్సు యాజ్యమాన్యం నష్టాన్ని పూరించడానికి, బస్సు ధరలను పెంచితే, ఇబ్బంది పడేడి ప్రయాణించే మనమే కదా!! ఈ విషయాలు, దాడిచేస్తున్నప్పుడు  ఉద్యమకారుల(దుండగలు) మదిలో మెదలదా? మెదలకేమి కాదు. వారిలోని రాక్షసానందాన్ని తీర్చుకోవడానికి, వారు అన్నీ వాస్తవాలు తెలిసినా, ఆగ్రహావేశాలకు లోనై, ఆ తప్పుడు పనులు చేస్తున్నారు. ఉద్యమం పేరుతో, ఆంధ్ర ప్రజలు మానవతా విలువలను విస్మరిస్తున్నారు. మానవీయ దృష్టిని కోల్పోతున్నారు. కొత్త రాష్ట్రాల గొడవలో, వున్న రాష్ట్రాన్ని నరకప్రయం చేయడం ఏ విధంగా సమంజసం.

మసను, బుద్ధి రెండింటిని వీలైనంత మేరకు వాడి, క్రోదావేశాలకు లోనుకాకుండా, ఆలోచించి పరిష్కారం సాధించాలి. అంతే గాని పనులు మానివేసి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా కాదు. మన ప్రవర్తనను దిగజార్చుకొనే విధంగా కాదు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 7 వ్యాఖ్యలు )

వై.యస్. ఇక లేరు

Posted on సెప్టెంబర్ 3, 2009. Filed under: Uncategorized | ట్యాగులు:, , , , , , |

మన గౌ॥ ముఖ్యమంత్రి డా॥వై.యస్. రాజశేఖర రెడ్డి ఇక లేరు. ఆయన కాలమైపోయారు. ఒక దురదృష్ట సంఘటనలో ఆయన గతించారు. గతంలో ఎన్నడూ చేపట్టని రీతిలో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆయనను మన మధ్యకు తీసుకు వస్తారని భావిస్తున్న నేపథ్యంలో, ఈ మరణ వార్త వెలువడడం చాలా బాధాకరం. 60 ఏళ్ల ఆయన ప్రస్థానం ఈ రోజుతో‌ ముగిసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాం.

ఈ దుర్ఘటన యొక్క పూర్తి వివరములు కొరకు నా మిత్రుడు గవేష్ నాకు అందించిన ఈ లంకెను మీరు చూడగలరు.

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

టపా మొత్తం చదవండి | Make a Comment ( 3 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...