Archive for జూలై, 2011

ప్రతి నరుడు – ఓ నటుడు

Posted on జూలై 30, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, నా విసుర్లు | ట్యాగులు:, , , , , |

రంగస్థలంపై నటించిన వారిని అందరు చూస్తారు. ఆ నటుల అభినయాన్ని అభిమానించేవారు వారు కొందరైతే, ఆరాధించేవారు కొందరు. వ్యాఖ్యానించేవారు కొందరైతే, ఆక్షేపణ తెలిపేవారు కొందరు. వెండితెర నటులుపై ఎన్నో రచనలు, బ్లాగులలో టపాలు వున్నాయి. వాటికి భిన్నంగా రోజూ మన చుట్టూ వుండే నిజ జీవిత నటుల గురించి ప్రస్తావించాలని నేను నిశ్చయించాను.

ఈ నిజ జీవిత నటులు ఎవరని అలోచిస్తున్నారా?! ఈ భువిపై నివసించే ప్రతి నరుడు, నటుడే. వెండితెరపై అందరు మెరవలేరు, కాని జీవితం అనే రంగస్థలంపై తమ అభినయ ఛాతుర్యాన్ని ప్రదర్శించి తళ్ళుక్కుమన్నవారు కోకొల్లలు. మన చుట్టూ వున్న వారు ఎలా నటిస్తున్నారో తెలుసుకోవడానికి ఒక్క రోజు వెచ్చించండి. ఆ ఒక్క రోజు మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను నిశితంగా గమనించండి. అప్పుడు మీకు తెలిసిన వారు, మీతో కలియతిరుగుతున్న వారు ఎలా నటిస్తున్నారో, ఎందుకు నటిస్తున్నారో తెలుస్తుంది.

అందరూ ఎల్లాప్పుడు నటించరు. నా వుద్దేశంలో నటించడం అంటే, ఒక వ్యక్తి తను తానులా ప్రవర్తించక  కాస్త లేక పూర్తి భిన్నంగా ప్రవర్తిచడం. మనకు తెలిసో తెలియకో మనము కుడా ఇటువంటి పనిని ఎన్నో మార్లు చేసి వుంటాం. ఇటువంటి నటన సబబేనా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటం ఎంతో కష్టము. ప్రతి వొకరికి, వారి కారణాలు అవసరాలు వుంటాయి. వాటిని తప్పుబట్టలేం, అలాగని ఎల్లప్పుడు స్వీకరించలేం. మనకు హాని కలగనంత వరకు, వాటిని అంగీకరిస్తాం. అలా కాని పక్షాణ, వాటికి తిరస్కరిస్తాం. మనుషుల పలు సహజమైన ప్రవర్తనలలో ఇదొకటి.

మీలోను ఒక నటుడు/నటి ఉన్న వాస్తవం మరవకండి. ఈ క్షణం నుండే మీ నటనా చాతుర్యాన్ని సానబెట్టండి.

Read Full Post | Make a Comment ( 1 so far )

Liked it here?
Why not try sites on the blogroll...