Archive for అక్టోబర్, 2014

మాల్టా ముచ్చట్లు

Posted on అక్టోబర్ 31, 2014. Filed under: ప్రాయాణాలు, వ్యక్తిగతం | ట్యాగులు:, , |

మాల్టా.. మధ్యధరా సముద్రంలో ఐరోపా ఖండంకు చెందిన మూడు చిన్ని చిన్ని దీవుల దేశం. కలలో కూడా నేను ఈ దేశం వస్తానని ఊహించలేదు. కానీ, మన దేశం కానిది ఏదైనా విదేశమే కావడం చేత, మాల్టా వచ్చేసాను.

Mdina వీధులలో

Mdina వీధులలో

మన వంటలు, సినిమాలు, షికార్లు గట్రా ఇక్కడ లేకున్నా, ఇక్కడ ప్రజల ఆతిథ్యం, వీరి గౌరవ మర్యాదలు ఆ లోట్లను పూడుస్తున్నాయి. గోదుమ వర్ణపు చర్మం కలిగిన మనలను, తక్కువ చూపు చూస్తారన్న నా అభిప్రాయాన్ని మాల్టీయులు తుడిచిపారేశారు. చూడగానే ఇట్టే మనం భారతీయులమని పసిగట్టేస్తారు. బహుశా అది పెద్ద రాకెట్ సైన్సు కాదనుకోండి. కానీ అంతటితో ఆగకుండా, వీలైతే పలకరిస్తారు. కొన్ని సారు అయితే, ప్రశ్నల జల్లు కురిపిస్తారు.

మీకు ధ్యానం వచ్చా?

యోగా చేస్తారా?

మీరు గోమాంసం ఆరగించారు కదా?

ఎలప్పుడు బియ్యం(అన్నం) ఎలా తింటారు?

మీకు ఇక్కడ ఇండియన్ కాఫీ దొరకడండి. హహహ!!

ఇక్కడి ప్రాచీన మరియు నవీన భవంతుల మేళవింపు చూడ ముచ్చటగా వుంది. మాల్టీయులకు దైవ భక్తి కాస్త ఎక్కువనే చెప్పాలి. మనకు ప్రాంతానికో గుడి లాగా, వీళ్ళకు అక్కడకడ ఒక చర్చి వుంటున్నది. మరలా అవి చిన్నవి కూడా కావు మరి. అయినా, వీరి పరమత సహనం నన్ను అబ్బురపరిచింది.

వంపులు తిరగని దార్లు చూడడం చాలా కష్టమే. ప్రతి ఒకరు కారు కలిగివుంటారు. ఒక్క Rolls Royce కారు తప్ప, అన్నీ కంపనీల కార్లు ఇక్కడ చూడవచ్చు. BMW, AUDI, Benz లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి ఇక్కడ. మన Maruti 800, Gypsy, tata sumo ల లాంటివి కూడా, వీరు వదలిపెట్టలేదు. సన్నటి సందులలో సైతం వీరు చాలా చాకచక్యంతో కార్లు తోలేస్తూ వుంటారు. దానికి కారణం మాల్టీయులు చట్టాన్ని బాగా పాటించడమే. one ways, zebra crossing లాంటి వాటిని పాటిస్తారు, పోలీసులు వున్నా, లేకున్నా.

వయసు మరియు లింగ భేదం అవేవీ లేకుండా, అందరూ అన్నీ రకముల పనులు చేయడం, నాకు చాలా ఆనందాన్ని కలుగజేసింది. దాదాపు అందరూ పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం నివ్వెరపరిచింది. వయసు మీరిన వారు సందు చివర్లలో, బార్, క్లబ్ ముందర కుర్చీలపై కాలక్షేపం చేయడం ముచ్చట కలిగిస్తుంది. bonjour అని చెయ్యి పైకెత్తి మరి పలకరిస్తారు. సముద్ర తీరాలలో ఈత దుస్తులలో కూడా వీరు కనువిందు చేస్తారు.

మాల్టీస్ ఇక్కడి వారి భాష. లిపి ఆంగ్లం లాగే వున్నా, భాష మాత్రం కాస్త చిత్రంగానే వుంటుంది. అరబ్, ఇటాలియన్, ఫ్రెంచి, ఆంగ్ల భాషల ప్రభావం వీరి భాషపై ఎక్కువనే చెప్పాలి. పలు మార్లు, మాల్టీయులు మామూలుగా మాట్లాడుతున్నా, వారు పోట్లాడుతున్నారేమో అన్న భావన కలుగుతుంది. X ను ‘ఎక్స్’ అని కాక ‘ఇష్’ గా పలకాలి; J ను ‘జె’ అని కాకుండా, ‘యా’గా పలకాలి; ‘Q’ నైతే ఏకంగా వదలిపెట్టేయాలి.

ఇప్పటికీ ఇవే నా మాల్టా ముచ్చట్లు.

Read Full Post | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...